బాలకృష్ణ(Balakrishna) కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ'(Akhanda). మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Balakrishna: 'అఖండ'.. జులై నుంచి హైదరాబాద్‌లో! - అఖండ సినిమా
కరోనా రెండో దశ తగ్గుముఖం పడటం వల్ల వరుసగా చిత్రీకరణలు పునఃప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా హీరో బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న 'అఖండ' చిత్రానికి సంబంధించిన మిగిలిన షూటింగ్ జులై తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది.
బాలకృష్ణ
జులై తొలి వారం నుంచి హైదరాబాద్‌లో ఈ ఆఖరి షెడ్యూల్ ప్రారంభించనున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఓ పాటతో పాటు కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు తెర కెక్కించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఈ చిత్రంలో రెండు శక్తిమంతమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. వరదరాజులు అనే ప్రతినాయకుడిగా శ్రీకాంత్(Srikanth) కనిపిస్తారు. ఇందులో ఆయన గెటప్.. పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉండనున్నాయని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు.
ఇదీ చూడండి :