తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Akhanda Sequel: బాలయ్య 'అఖండ'కు సీక్వెల్​.. నిజమేనా? - అఖండ సీక్వెల్​

Akhanda Sequel: బోయపాటి-బాలకృష్ణ కాంబోలో వచ్చిన 'అఖండ' చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. బాలయ్య కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. అయితే ఈ బ్లాక్​బస్టర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుందట. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇదే అంశం హాట్ టాపిక్​గా మారింది.

అఖండ సీక్వెల్​, Akhanda sequel
అఖండ సీక్వెల్​

By

Published : Dec 7, 2021, 12:30 PM IST

Akhanda Sequel: బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన సినిమా 'అఖండ'. ఈ చిత్రం విడుదలైన తొలి షో నుంచే సూపర్​హిట్​ టాక్​ తెచ్చుకుని బాక్సాఫీస్​ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, గెటప్​, తమన్​ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ సినిమాకు హైలైట్​గా నిలిచాయి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ కూడా తెరకెక్కిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆద్యంతం ఈ చిత్రంలో చూపించిన కొన్ని సన్నివేశాలు, మూవీ ముగించిన విధానం, అఘోర క్యారెక్టర్​కు ప్రేక్షకులు బాగా కనెక్ట్​ అవ్వడం వంటివి చూస్తే సీక్వెల్​ వస్తుందని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు.

ఈ మూవీ క్లైమాక్స్​లో 'ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి' అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోతాడు. కానీ.. వెళ్లే ముందు మాత్రం సినిమాలో కీలక పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. 'నీకు ఆపద వచ్చినప్పుడు నీ ముందు ఉంటాను' అని చెప్తాడు. దీంతో సీక్వెల్​ను తెరకెక్కిస్తే.. ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం.. అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు సినీవర్గాల్లో ఇదే అంశపై జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ అంశాలు ఉండొచ్చు

ఒకవేళ సీక్వెల్​ను తెరకెక్కిస్తే బాలకృష్ణ(అఘోర) నేపథ్యాన్ని చూపించొచ్చు. సినిమా ప్రారంభంలో పసిగుడ్డుగా ఉండగానే కాశీకి చేరతాడు బాలకృష్ణ. మరి అక్కడ ఎవరి దగ్గర, ఎలా పెరిగాడు? వంటి అంశాలను సీక్వెల్​లో చూపించొచ్చు. ఇక ఈ మూవీలో బాలకృష్ణ(అఘోర) ఫ్లాష్​బ్యాక్​లో బాలయ్య చెడ్డ అఘోరాలను వెంటాడి మరీ చంపినట్లు చూపించారు. ఇందులో బాలయ్య(అఘోర) కర్తవ్యం పాడు బడిన గుడులను బాగుచేయడం. ఆ ఆలయాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడం. మరి ఈ క్రమంలో అతడికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? అందుకే చెడ్డ అఘోరాలను చంపాడా? ఇవి కూడా సీక్వెల్​లో చూపించొచ్చు.

ఇదీ చూడండి: 'ఆ నమ్మకంతోనే అఖండ సినిమా తీశా'

ABOUT THE AUTHOR

...view details