నందమూరి బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబరు 14 సాయంత్రం 7:09 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన 'అఖండ' రోర్, టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. అందులో అఘోరా రోల్ కూడా ఉండటం విశేషం.