నటసింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ దర్శకుడు బోయపాటి శ్రీను, ఫైట్ మాస్టర్ విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌తో పాటు అన్ని యాక్షన్ సీక్వెన్సల చిత్రీకరణ ముగిసిందని స్పష్టం చేశారు.
'అఖండ' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రచ్చ రచ్చే - బాలకృష్ణ అఖండ లేటెస్ట్ న్యూస్
బాలయ్య 'అఖండ' రాకకు రంగం సిద్ధమైంది. బుధవారంతో చిత్రీకరణ పూర్తవగా, త్వరలో విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు.
బాలయ్య అఖండ
ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్‌రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. షూటింగ్ పూర్తికావడం వల్ల త్వరలో రిలీజ్ డేట్ విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి: