తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జై బాలయ్య' పాట.. బాలయ్య స్టెప్పులు అదుర్స్! - balakrishna allu arjun

'అఖండ' నుంచి 'జై బాలయ్య' అంటూ సాగే వీడియో సాంగ్​ను రిలీజ్ చేశారు. అభిమానుల్ని అలరిస్తున్న ఈ గీతం.. ఈ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

balakrishna akhanda movie
బాలకృష్ణ అఖండ మూవీ

By

Published : Nov 28, 2021, 8:42 AM IST

నందమూరి బాలకృష్ణ అభిమానులు.. ఆయన సినిమాలకు వెళ్లినా, మరే ఇతర సినిమాలకు వెళ్లినా సరే ఎక్కువగా అరిచి, గోల చేసే పదం 'జై బాలయ్య'. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు ఆ పదంతోనే 'అఖండ'లో ఏకంగా పాట రూపొందించారు తమన్. ఈ గీతానికి బాలయ్య మాస్ స్టెప్పులు కేక పుట్టిస్తున్నాయి. షర్ట్​లతో వేసిన స్టెప్​కు అయితే థియేటర్లలో ఫ్యాన్స్​ గోల చేయడం గ్యారంటీ. ఇంకెందుకు ఆలస్యం ఆ పాట వీడియో సాంగ్ మీరు చూసేయండి.

'అఖండ'లో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోరా కావడం ఆసక్తి రేపుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు. డిసెంబరు 2న సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details