తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బట్టతలతో ఆయుష్మాన్​.. కామెడీ కిర్రాక్​..! - ayushman khurana

ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బాలా. ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. నవంబర్​ 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఆయుష్మాన్

By

Published : Oct 10, 2019, 1:33 PM IST

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన చిత్రం బాలా. ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. భూమి పడ్నేకర్, యామి గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. అమర్ కౌషిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేటి తరం యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యపై ఈ సినిమా తీశారు. వెంట్రుకలు రాలిపోవడం వల్ల కుర్రకారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది హాస్యప్రధానంగా తెరకెక్కించారు.

దినేశ్ విజయన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సీమా పహ్వా, సౌరభ్ శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే డ్రీమ్​గర్ల్ చిత్రంతో హిట్ కొట్టిన ఆయుష్మాన్ మరో విజయంపై కన్నేశాడు.

ఇదీ చదవండి: బాక్సర్​గా వరుణ్​తేజ్.. మరో ప్రయోగానికి సిద్ధం

ABOUT THE AUTHOR

...view details