నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే 'రూలర్' అనే పేరును ఖరారు చేశారు. పోలీస్ లుక్‌లో బాలయ్య ఫొటోను విడుదల చేశారు. ధర్మ అనే పాత్రలో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాడీ కథానాయకుడు.
పోలీస్‌గా బాలకృష్ణ.. 'రూలర్' అంటూ గర్జన - హీరో బాలకృష్ణ
కథానాయకుడు బాలకృష్ణ 105వ సినిమాకు 'రూలర్' అనే టైటిల్ ఖరారు చేశారు. దీపావళి కానుకగా పోస్టర్‌ను విడుదల చేశారు.
పోలీస్‌గా బాలకృష్ణ.. 'రూలర్' అంటూ గర్జన
ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నాడు. 'జైసింహా' తర్వాత బాలకృష్ణ, నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Last Updated : Oct 26, 2019, 3:33 PM IST