తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వంద కోట్ల క్లబ్​లో ఆయుష్మాన్ 'బాలా'.. - bollywood latest cinema news

బాలీవుడ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానా హీరోగా నటించిన చిత్రం 'బాలా'. విడుదలైన మూడు వారాల్లో భారీ వసూళ్లు సాధిస్తూ.. వందకోట్ల క్లబ్​లో చేరింది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

వంద కోట్ల క్లబ్​లో చేరిన 'బాలా'

By

Published : Nov 23, 2019, 6:38 PM IST

Updated : Nov 23, 2019, 7:02 PM IST

బాలీవుడ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానా నటించిన 'బాలా' సినిమా బాక్సాఫీస్​ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన మూడు వారాల్లో భారీ వసూళ్లు సాధించి వందకోట్ల క్లబ్​లో చేరింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా పేర్కొంది చిత్రబృందం. 'బాలా' మూవీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

అమర్​ కౌశిక్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమి పెడ్నేకర్​, యామి గౌతమ్​ హీరోయిన్లు. దినేశ్ విజయన్ నిర్మించిన చిత్రంలో సీమా పహ్వా, సౌరభ్ శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే 'డ్రీమ్​గర్ల్' చిత్రంతో హిట్ కొట్టిన ఆయుష్మాన్ ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Last Updated : Nov 23, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details