బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్‌ను ముంబయి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో రియా మరిన్ని రోజులు బైకుల్లా జైలులోనే ఉండనుంది.
సుశాంత్ కేసులో రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరణ - రియా చక్రవర్తి బెయిల్
సుశాంత్ మృతితో పాటు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరణకు గురైంది.
సోదరుడు సోవిక్తో రియా చక్రవర్తి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో రియా ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీని విచారణలో భాగంగా ఆమెను సీబీఐ విచారించగా.. డ్రగ్స్ కోణం బయటపడింది. తద్వారా నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. ఈనెల 23 వరకు జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. ముంబయి సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం ఆమె దరఖాస్తు చేసుకోగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. వారి బెయిల్‌ను తిరస్కరించింది.