తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లండన్​ రాయల్​ ఆల్బర్ట్​హాల్లో 'బాహుబలి'

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి ద బిగినింగ్' చిత్రాన్ని లండన్ రాయల్​ ఆల్బర్ట్​ హాల్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని రానానే ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

By

Published : Oct 16, 2019, 10:57 AM IST

Updated : Oct 16, 2019, 2:11 PM IST

బాహుబలి

బాహుబలి.. ఇప్పటికే ఎన్నో గౌరవాలను అందుకున్న ఈ సిరీస్ మరో అరుదైన ఘనత దక్కించుకుంది. అక్టోబరు 19వ లండన్​లోని రాయల్ ఆల్బర్ట్ ​హాల్లో ప్రదర్శితమవనుంది. ఈ విషయాన్ని హీరో రానా స్వయంగా వెల్లడించాడు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది బాహుబలి చిత్రబృందం.

బాహుబలి మొదటి భాగాన్ని అక్కడ ప్రదర్శించనున్నారు. రాయల్​ ఆల్బర్ట్ హాల్ వేదికపై సినిమాతోపాటు ప్రత్యేక ఆర్కేస్ట్రాతో సంగీత ప్రదర్శన నిర్వహించనున్నట్లు రానా వీడియోలో చెప్పాడు.

2015లో బాహుబలి ద బిగినింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. 2017లో విడుదలైన బాహుబలి ద కన్​క్లూజన్ దాదాపు రూ.1800కోట్ల వసూళ్లతో ఘనవిజయం సాధించింది.

ఇదీ చదవండి: గాడ్జిల్లా దర్శకుడి చిత్రంలో నిక్ జొనాస్​

Last Updated : Oct 16, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details