లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో బాహుబలి చిత్రబృందానికి అరుదైన గౌరవం లభించింది. శనివారం ఇక్కడ బాహుబలి మొదటి భాగాన్ని ప్రదర్శించగా.. అనంతరం వారికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆర్కెస్ట్రా సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రేక్షకులంతా నిల్చుని వారిని అభినందించారు.
ఏ భారతీయ చిత్రానికి లభించని ఈ గౌరవం బాహుబలికి దక్కడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, శోభు యార్లగడ్డ హాజరయ్యారు. ఈలలు, గోలలు నడుమ రాయల్ ఆల్బర్ట్ హాల్ హోరెత్తింది.