తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లండన్​లో 'బాహుబలి'.. ఫొటో షేర్​ చేసిన రాజమౌళి - bahubali film

లండన్​లోని రాయల్ ఆల్బర్ట్​హాల్​లో 'బాహుబలి' సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యక్ష ప్రదర్శనను తిలకించేందుకు అక్కడికి చేరుకుంది చిత్రబృందం.

లండన్​లో 'బాహుబలి'.. ఫొటో షేర్​ చేసిన రాజమౌళి

By

Published : Oct 19, 2019, 8:14 AM IST

బ్లాక్​బస్టర్​ 'బాహుబలి' బృందం మరోసారి కలిసింది. మూడో భాగం తెరకెక్కించేందుకు అనుకున్నారేమో! కానే కాదు. లండన్​లో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్​హాల్​లో నేడు(శనివారం) సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో సంగీత విభావరి జరగనుంది. ఇందులో ఒరిజినల్​ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ను ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చిత్రబృందం అంతా అక్కడికి చేరుకున్నారు. ఆ ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.

రాజమౌళి షేర్​ చేసిన ఫొటో

రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్​ను అంతర్జాతీయ​ స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో 'బాహుబలి'గా ప్రభాస్ అదరగొట్టాడు. ప్రతినాయకుడిగా రానా మెప్పించాడు. మిగతా నటీనటీలు ఫరిది మేరకు ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందీ సినిమా.

ఇది చదవండి: బాహుబలి ఇంటర్వెల్ వేరేలా తీయాలనుకున్నా: దర్శకుడు రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details