లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లను తెరుచుకోవచ్చని గత నెలలోనే కేంద్రం ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి నియమ నిబంధనలూ విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మల్టీఫ్లెక్సులు తెరచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ల్‌తోనే థియేటర్లు నడుస్తున్నాయి.
గురువారం నుంచి మహారాష్ట్రలో, నవంబరు 10 నుంచి తమిళనాడులోనూ సినిమా హాళ్లు తెరవనున్నారు. అయితే వీటిల్లో ఆడించడానికి కొత్త సినిమాలు లేవు. ఫలితంగా గతంలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలనే మళ్లీ ప్రదర్శించనున్నారు.