తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఆ తర్వాత ఇప్పటివరకు మరో ప్రాజెక్టును వీరు పట్టాలెక్కించలేదు. తొందరగా తీయాలని కాకుండా చక్కని సినిమాను తీయాలనుకోవడం ఇందుకు కారణం. ఇప్పుడు కొత్త చిత్రం ప్రకటించారు. 'కేరాఫ్ కంచరపాలెం'తో ఆకట్టుకున్న వెంకటేశ్ మహాతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రకటించారు. 'ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య' అనే టైటిల్ చెప్పడం సహా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సత్యదేవ్ టైటిల్ రోల్లో కనిపించనున్నాడు.
'బాహుబలి' నిర్మాతలతో 'కంచరపాలెం' దర్శకుడు సినిమా - కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు
ప్రతిష్టాత్మక 'బాహుబలి'ని తీసిన నిర్మాతలు శోభు-ప్రసాద్.. తర్వాతి ప్రాజెక్టు ప్రకటించారు. 'కేరాఫ్ కంచరపాలెం'తో గుర్తింపు పొందిన వెంకటేశ్ మహాతో 'ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య' సినిమా తీస్తున్నారు. వచ్చే ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేశ్ మహా కొత్త చిత్రం
మలయాళంలో హిట్ అయిన 'మహేశింతే ప్రతీకారమ్'కు రీమేక్ ఈ సినిమా. అందులో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడీ చిత్రాన్ని సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 17న విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత బిజ్‌బల్ సంగీతమందిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.