తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్ చనిపోయాకే ఆ విషయం తెలిసింది: రాజమౌళి - రాజమౌళి

పునీత్ రాజ్​కుమార్ అకాల మరణం (Puneeth Rajkumar Death) ఎంతో వేదనకు గురిచేసిందన్నారు దర్శకుడు రాజమౌళి. నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఆ షాక్​లోనే చాలా మంది ఉన్నారని చెప్పారు. బెంగళూరులోని పునీత్ ఇంటికి శుక్రవారం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజమౌళి (SS Rajamouli News).

puneeth rajkumar
రాజమౌళి

By

Published : Nov 26, 2021, 7:34 PM IST

Updated : Nov 26, 2021, 8:48 PM IST

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన రాజమౌళి

కన్నడ పవర్​స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్​కుమార్ మరణించి (Puneeth Rajkumar Death) దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. ఆ షాక్​ నుంచి ఇంకా కోలుకోలేదని అన్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ ఘటన జరగడం చాలా బాధగా ఉందని చెప్పారు. బెంగళూరు సదాశివ నగర్​లోని పునీత్​ ఇంటికి వెళ్లిన సందర్భంగా రాజమౌళి (SS Rajamouli News) భావోద్వేగానికి గురయ్యారు.

"పునీత్ మరణ వార్త ఇప్పటికీ చాలామందికి షాకింగ్​గానే ఉంది. ఈ (పునీత్) ఇంట్లోనే మేము ఒకటి, రెండు సార్లు కలుసుకున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యుడిలా ఆదరించారు. ఇలా జరగడం ఎంతో బాధగా ఉంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే ప్రపంచం మొత్తానికి తెలియాలనుకుంటాం. కానీ, తన సేవా కార్యక్రమాల గురించి ఎవరితోనూ చెప్పలేదు. పునీత్ చనిపోయిన తర్వాతే అవన్నీ బయటకు వచ్చాయి. ఎంతో గొప్ప మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా."

- రాజమౌళి, దర్శకుడు

పునీత్ రాజ్​కుమార్​.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ కుమారుడు. ఐదుగురు సంతానంలో ఆయనే చిన్నవాడు. అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ గుండెపోటు రాగా ఆస్పత్రిలో చేరిన పునీత్​.. ఆరోజే మరణించారు(puneeth rajkumar news). 6 నెలల వయసులోనే వెండితెర తెరంగేట్రం చేసిన ఆయన.. 2002లో 'అప్పు' సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యారు. పలు సూపర్​హిట్ సినిమాల్లో నటించి కన్నడ పవర్​స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప దాతృత్వం చాటుకున్నారు.

Last Updated : Nov 26, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details