Bahubali 3 OTT Release Date: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. కాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఓ సిరీస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసినట్లు సమాచారం.
రూ.150కోట్లతో తీసిన 'బాహుబలి 3'ని పక్కన పెట్టేశారా?
Bahubali 3 OTT Release Date: దక్షిణాది చిత్రాలకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరుగుతున్నారు. ఓటీటీల్లో వీటి కోసం తెగ వెతికేస్తూ వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్.. 'బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్' పేరుతో ఓ సిరీస్‌ను నిర్మించాలని చూసింది. కానీ ప్రసుత్తం దీనిని తాత్కాలికంగా పక్కన పట్టేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ రూ.150కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరిపారు. అయితే, ఫైనల్ అవుట్‌పుట్‌పై సంతృప్తి చెందని నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసిందట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త తెగవైరల్ అవుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే, అంతకు ముందే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని చిత్రీకరించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత వామికా గబ్బి కీలక పాత్రలో చాలా సన్నివేశాలను రీషూట్ చేశారు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారా? లేక తాత్కాలికమేనా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. 'ది రైజ్ ఆఫ్ శివగామి', 'చతురంగ', 'క్వీన్ ఆఫ్ మాహిష్మతి' రచనల ఆధారంగా ఆనంద్ నీలకంఠన్, దేవకట్టా ఈ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రవీణ్ సత్తార్‌తో కలిసి దేవకట్టా దీనికి దర్శకత్వం వహించారు. వామికా, రాహుల్ బోస్, అతుల్ కుల్‌కర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి:అడివి శేష్ 'మేజర్' వాయిదా.. 'జైభీమ్'కు మూడు అవార్డులు