తెలంగాణ

telangana

ETV Bharat / sitara

3 గంటల 'బాహుబలి'ని 130 సెకన్లలో చూపిస్తే - 130 సెకన్లలో 'బాహుబలి 2'... మీరూ చూసేయండి

ప్రపంచవ్యాప్తంగా చరిత్రసృష్టించిన 'బాహుబలి 2' విడుదలై మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం చిత్రీకరణ సమయంలో దిగిన అరుదైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాకు సంబంధించి, ఓ ఆసక్తికర వీడియోను ట్వీట్ చేశాడో అభిమాని.

Bahaubali the Conclusion movie has completed three years
130 సెకన్లలో 'బాహుబలి 2'... మీరూ చూసేయండి

By

Published : Apr 28, 2020, 4:00 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. తొలి భాగం 'బాహుబలి: ది బిగినింగ్‌' చివరిలో 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అన్న ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులు రెండేళ్ల పాటు వేచి చూశారు. అలా ఏప్రిల్‌ 28, 2017న విడుదలైన 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'కు నేటితో మూడేళ్లు పూర్తయింది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ తదితరుల నటన.. సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.

ప్రభాస్​, అనుష్క, రాజమౌళి

ఈ సినిమాకు మూడేళ్లు అయిన సందర్భంగా ట్విటర్​లో‌ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. చిత్రీకరణ సందర్భంగా తీసిన అరుదైన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇక ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. "ఏప్రిల్‌ 28 భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. చరిత్ర సృష్టించింది. బాక్సాఫీస్‌లు బద్దలు కొట్టింది. గతంలో ఏ చిత్రమూ సాధించని విధంగా వెయ్యి కోట్లు వసూళ్లు సాధించింది. 'జై మాహిష్మతి' అని బాహుబలి చిత్ర బృందం ట్వీట్‌ చేసింది.

అనుష్క, రాజమౌళి, రానా

అయితే 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమాను 10ఎక్స్‌ స్పీడ్‌లోకి మార్చి ఓ అభిమాని పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. హైలైట్‌ సన్నివేశాలు వచ్చినప్పుడు స్లోమోషన్‌లో చూపించిన ఈ వీడియో.. ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

నా జీవితంలో పెద్ద సినిమా ఇదే
ఈ సందర్భంగా 'బాహుబలి' నటుడు ప్రభాస్‌ స్పందిస్తూ.."నా జీవితంలోనే అతిపెద్ద చిత్రం. ఇలాంటి ఘనవిజయాన్ని అందించించిన అభిమానులకు, చిత్రబృందానికి, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు" అని అన్నాడు.

కట్టప్ప, రాజమౌళి

ఇదీ చూడండి : అమ్మ సెంటిమెంట్​కు యముడి యాక్షన్ తోడైతే

ABOUT THE AUTHOR

...view details