ఎప్పుడైనా మూడు అద్దాల కళ్లజోడు చూశారా! ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా మూడు అద్దాలతో రెండు కళ్లు ఎలా చూస్తాయి అనుకుంటున్నారా. అయితే ప్రభుదేవా కొత్త రూపాన్ని మీరు చూడాల్సిందే. రెండద్దాలు రెండు కళ్లకు మరోటి నుదట పెట్టి సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాదు ప్రభు తలపై రక్తపు మరకలు సందేహంలో పడేసే విధంగా ఉన్నాయి. ఇదంతా 'బఘీరా' సినిమాలోని ఫస్ట్లుక్లోనిది.
'బఘీరా' ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన ప్రభుదేవా - ప్రభుదేవా న్యూస్
ప్రభుదేవా హీరోగా అధిక్ రవిచందర్ దర్శకత్వంలో 'బఘీరా' అనే తమిళ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'బఘీరా' ఫస్ట్‌లుక్‌తో అదరగొట్టిన ప్రభుదేవా
అధిక్ రవిచందర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రమిది. తాజాగా ఈ సినిమాలోని ప్రభుదేవా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. 'జంగిల్ బుక్'లోని బఘీర పాత్రను పోలి ఉంటుందని సమాచారం. భరతన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి.. 'సింగిల్' ఫరెవర్ అన్నాడు.. సింపుల్‌గా పెళ్లికొడుకయ్యాడు
Last Updated : Mar 1, 2020, 11:18 AM IST