సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్, సితారతో కలిసి మహేశ్ దంపతులు సరదాగా గడిపేందుకు ఈ టూర్ వెళ్లారు. పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు మహేశ్, నమ్రత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
42వేల అడుగుల ఎత్తులో మహేశ్ ప్రయాణం - tollywood prince mahesh babu
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబం స్విట్జర్లాండ్ పర్యటనను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌కు తిరుగుపయనమైన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు ప్రిన్స్.
![42వేల అడుగుల ఎత్తులో మహేశ్ ప్రయాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4730024-thumbnail-3x2-mahesh.jpg)
మహేశ్
అయితే తాజాగా వీరు స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మహేశ్ తన కుమారుడు గౌతమ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ 'బ్యాక్ టు వర్క్ అండ్ స్కూల్' అని పోస్టు చేశాడు. నమ్రతతో దిగిన మరో ఫొటోను షేర్ చేస్తూ 'ఫొటో తర్వాత నేను పొలరాయిడ్‌కు అభిమానిని అయిపోయాను. 42వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాము. ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు.