విభిన్న చిత్రాలు చేసే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరో డిఫరెంట్ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. 'బచ్చన్ పాండే' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడీ కథానాయకుడు. ఇందులో 'తషన్' అనే డాన్‌గా కనిపించనున్నాడు అక్షయ్. ఫొటోలో నల్లని సిల్క్ లుంగీ, ఒంటిపై బంగారు ఆభరణాలు ధరించి చేతిలో నాన్‌చాక్‌ను పట్టుకున్న అక్కీ లుక్ ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది క్రిస్మస్కు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను సాజిద్ నడియావాలా నిర్మిస్తుండగా... ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించనున్నాడు.
సిల్క్ లుంగీతో అదిరే లుక్‌లో అక్షయ్ - akshay kumar as don
'బచ్చన్ పాండే' పేరుతో తెరకెక్కనున్న మరో విభిన్న సినిమాలో హీరోగా కనిపించనున్నాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సిల్క్ లుంగీతో అదిరే లుక్‌లో అక్షయ్
ఈ ఏడాది ఇప్పటికే 'కేసరి'గా అలరించాడు కిలాడీ అక్షయ్. 'మిషన్ మంగళ్', 'హౌస్‌ఫుల్-4', 'గుడ్ న్యూస్' చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవే కాకుండా వచ్చే ఏడాది 'సూర్యవంశీ', 'లక్ష్మీ బాంబ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇది చదవండి: విజయ్ సినిమా కోసం ఫ్యామిలీతో రష్మిక ఫైట్!