బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్, కృతి సనన్ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'బచ్చన్ పాండే'. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని జైసల్మేర్ వెళ్లింది చిత్రబృందం. అక్షయ్, కృతితో పాటు దాదాపు 100 మంది చిత్రీకరణ కోసం బయల్దేరారు. ఈ షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలవనుంది. నెలరోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరపనున్నారు.
రాజస్థాన్‌కు 'బచ్చన్ పాండే' చిత్రబృందం
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'బచ్చన్ పాండే'. కృతి సనన్ హీరోయిన్గా కనిపించనున్న ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లింది చిత్రబృందం.
రాజస్థాన్‌కు 'బచ్చన్ పాండే' చిత్రబృందం
ఇప్పటికే 'బెల్ బాటమ్' చిత్రీకరణ పూర్తి చేసిన అక్షయ్, 'బచ్చన్ పాండే'తో పాటు 'అత్రాంగిరే', 'పృథ్వీరాజ్' షూటింగ్‌ల్లోనూ పాల్గొంటున్నాడు.