రజినీకాంత్ దర్బార్ చిత్రంలో బాలీవుడ్ నటుడు విలన్‌గా నటించనున్నాడు. హిందీలో 'ఏక్ దివానా థా', 'ధోబీఘాట్' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ బబ్బర్.. తాజాగా 'దర్బార్' చిత్రంలో చాన్స్ కొట్టేశాడు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.
ఈ చిత్రంలో రజినీ 25 ఏళ్ల తర్వాత పోలీస్‌గా కనిపించనున్నాడు. తొలిసారిగా సూపర్‌స్టార్, ఏ ఆర్ మురుగదాస్‌లతో నటించబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపాడు ప్రతీక్.