తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాహుబలి'ని ఫాలో అవుతున్న 'ఆర్​ఆర్​ఆర్​' - రామ్​ చరణ్​

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క ఫొటోనూ విడుదల చేయలేదు చిత్రబృందం. కొత్త సంవత్సరం, సంక్రాంతి అన్నీ వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రబృందానికి ఓ ఆసక్తికర ప్రశ్న సంధించాడు. తాను మాహిష్మతి సామ్రాజ్యానికి చెందిన వ్యక్తినని తాను 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫస్ట్‌లుక్‌ కోసం వేచి చూస్తున్నానని అన్నాడు.

baahubali-vs-rrr-fight-on-social-media
'బాహుబలి'ని ఫాలో అవుతున్న 'ఆర్​ఆర్​ఆర్​'

By

Published : Feb 4, 2020, 2:26 PM IST

Updated : Feb 29, 2020, 3:34 AM IST

'ఆర్​ఆర్​ఆర్' తొలిరూపు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణను భరించలేకపోతున్నామని.. త్వరగా ఫస్ట్​లుక్​ను విడుదల చేయాలని ఓ నెటిజన్​ ట్వీట్​ చేశాడు. ఆ ట్వీట్​పై బాహుబలి టీం స్పందించింది.

​ "'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌.. మా మాహిష్మతి ప్రజలు ఫస్ట్‌లుక్‌ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలా అంటున్నందుకు క్షమించాలి. ప్రతి పండగకు శుభాకాంక్షలు, ధన్యవాదాల సందేశాలతో సరిపెడుతున్నారు. మీరు పంచుకుంటున్న సందేశాలతో మా ప్రజలకు కాలక్షేపం అవుతోంది. డియర్‌ కెప్టెన్‌ రాజమౌళి దయచేసి అప్‌డేటివ్వండి.. ప్లీజ్‌.." అని బాహుబలి టీం ట్వీట్‌ చేసింది.

ఆ విషయంలో మీరే స్ఫూర్తి..

దీనికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ బదులిస్తూ.. "మీ మాటలు చూస్తే కింద పడి దొర్లి మరీ నవ్వాలనిపిస్తోంది. ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ అడుగు జాడల్లోనే మేము నడుస్తున్నాం. 'బాహుబలి' చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతగా వేచి చూశారో మేం మర్చిపోలేదు. మేము మా అభిమానులను ఎంతో ప్రేమిస్తాం. వాళ్లూ మమ్మల్ని అంతేలా ప్రేమిస్తారు. వాళ్లు పెట్టుకున్న ఆశలను మేము నెరవేరుస్తామని వాళ్లకు తెలుసు. కాబట్టి దయ చేసి 'ఆర్ఆర్ఆర్‌' ఫస్ట్‌లుక్‌ కోసం వేచి చూడండి. త్వరలోనే వస్తుంది" అని పంచ్‌ ఇచ్చింది.

ఆర్​ఆర్​ఆర్​ చిత్రీకరణలో రామ్​ చరణ్​, అజయ్​ దేవగణ్​, జూ.ఎన్టీఆర్​

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న 'ఆర్ఆర్‌ఆర్‌'లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా నటిస్తున్నారు. చెర్రీకి జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఓలివియా మోరిస్‌లు ఈ చిత్రంలో సందడి చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​'ను జులై 30న విడుదల చేయనున్నారు. ఇటీవల అజయ్‌ దేవగణ్‌తో కలిసి తారక్‌, చరణ్‌ దిగిన ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి.. ''జాను' టైటిల్​కు ప్రభాస్​ అనుమతి తీసుకున్నాం'

Last Updated : Feb 29, 2020, 3:34 AM IST

ABOUT THE AUTHOR

...view details