తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ-రానాల సినిమాకు దర్శకుడు అతడే! - అయ్యప్పనమ్​ కోషియం

'అయ్యప్పనుమ్​ కోషియుమ్' తెలుగు రీమేక్​ను యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.

Ayyappanum Khoshiyum telugu remake update
'అయ్యప్పనమ్​ కోషియం' రీమేక్​కు దర్శకుడు అతడే!

By

Published : Jun 27, 2020, 7:51 AM IST

మలయాళంలో విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్​కు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటులు రానా, రవితేజ‌ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

తెలుగు నేటివిటికి దగ్గరగా ఉండేందుకు మాతృకలో కొన్ని మార్పులు చేయనున్నారట. ఈ ఏడాది చివరకు సెట్స్​పైకి వెళ్లనుందట. ఒరిజినల్​ సినిమాకు సచీ దర్శకత్వం వహించగా, పృథ్వీరాజ్, బిజూ మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు.​ కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీ రీమేక్‌ హక్కులను బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం ఇప్పటికే దక్కించుకున్నారు.

ఇదీ చూడండి... మహేశ్ సినిమాలో నివేదా థామస్!

ABOUT THE AUTHOR

...view details