బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా.. 'ఛండీఘడ్ కరే ఆషికీ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ తన సొంత రాష్ట్రం ఛండీగఢ్లోనే జరుగుతోంది. కానీ, అతడు మాత్రం తన ఇంటికి వెళ్లడం లేదు. దానికి కరోనా మహమ్మారే కారణం అని తెలిపాడీ నటుడు. తన కుటుంబానికి వైరస్ సోకకూడదనే ఉద్దేశంతోనే.. హోటల్లో ఉంటున్నానని చెప్పాడు.
"నా వల్ల నా భార్య, ఇద్దరు పిల్లలకు వైరస్ సోకకూడదు. ఛండీగడ్లోనే ఉన్న నా తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీ పునఃప్రారంభంలో నేను భాగమవుతున్నప్పటికీ నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. అందుకోసమే.. నేను చిత్రబృందంతో పాటు హోటల్లో దిగాను. ఈ షూటింగ్ ముగిసే వరకు మేమంతా ఇక్కడే ఉంటాం."