హిందీలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా మారాడు ఆయుష్మాన్ ఖురానా. ఇటీవలే బట్టతల యువకుడిగా వచ్చి వసూళ్ల వర్షం కురిపించాడు. ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2017లో అతడు నటించిన 'శుభ్ మంగళ్ సావధాన్' సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన చిత్రం 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తెలిపింది చిత్రబృందం.
'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' షూటింగ్ పూర్తి - ఆయుష్మాన్ ఖురానా
ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తోన్న చిత్రం 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది.
శుభ్ మంగల్ జ్యాదా సావధాన్
ఈ సినిమాలో ఆయుష్మాన్ 'గే'గా కనిపించనున్నాడు. 2020 ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హితేశ్ కేవల్య దర్శకుడు. నీనా గుప్తా, గిరిరాజ్ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవీ చూడండి.. వరల్డ్ ఫేమస్ లవర్.. దేవరకొండ లుక్స్ ఇదిగో