తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోదీ, పిచాయ్​ల సరసన​ హీరో ఆయుష్మాన్​ - ఆయుష్మాన్​ ఖుర్రానా వార్తలు

టైమ్​ మ్యాగ్​జైన్​ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్​ ఖురానా చోటు దక్కించుకున్నాడు. ప్రధాని మోదీ, గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ల సరసన చేరాడు.

Ayushmann makes it to TIME's 100 Most Influential list: Deepika pens his profile
'టైమ్​' ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయుష్మాన్​

By

Published : Sep 23, 2020, 2:14 PM IST

ప్రఖ్యాత 'టైమ్​' మ్యాగ్​జైన్​ రూపొందించిన 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ యువహీరో ఆయుష్మాన్​ ఖురానా చోటు దక్కించుకున్నారు. 2018లో ఈ మ్యాగజైన్​కు ఎంపికైన దీపికా పదుకొణె.. దీనికోసం ఆయుష్మాన్​ ఖురానా ప్రొఫైల్​ రాసింది.

"ఆయుష్మాన్​ ఖురానా.. తన తొలి చిత్రం నుంచి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అంతకు ముందూ చిత్రపరిశ్రమలోనే ఉన్నాడు. అయితే ఈ రోజు అతడి గురించి మాట్లాడటానికి కారణం.. తన చిత్రాల్లో ఆయుష్మాన్​ పోషించిన పాత్రల ప్రభావమే. సాధారణంగా హీరోల చిత్రాల్లో తెరపై కనిపించే పురుషత్వ మూసవిధానం నుంచి బయటకు వచ్చి, సవాలుతో ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. కళలను బతికించుకోవాలని తపనతో ఉండే వారిలో ఆయుష్మాన్​ ఒకరు"

- దీపికా పదుకొణె, బాలీవుడ్​ నటి

ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను ఏటా ప్రచురిస్తుంది టైమ్​ మ్యాగ్​జైన్. వారి చేసే పనులతో సంబంధం లేకుండా సమాజంపై ప్రభావం చూపిన వ్యక్తుల పేర్లను ఈ జాబితాలో పొందుపరుస్తుంది.

ఈ జాబితాలో ఆయుష్మాన్​తో పాటు ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గూగుల్​ సీఈఏ సుందర్​ పిచాయ్​, లండన్​కు చెందిన భారత సంతతి డాక్టర్​ రవీంద్ర గుప్తా, షాహిన్​ బాగ్​కు చెందిన బిల్కిస్​-డాడీలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details