తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆమిర్​ చెప్పిన ఆ విషయం నన్ను స్టార్​ను చేసింది'

తాను స్టార్​డమ్​ను సంపాదించేందుకు ప్రముఖ హీరో​ ఆమిర్​ ఖాన్ ఓ కారణమని అన్నాడు​ నటుడు ఆయుష్మాన్​ ఖురానా. తనకు ఎన్నో విషయాల్లో ఆయన స్ఫూర్తిగా నిలిచారని చెప్పుకొచ్చాడు.

amir
అమీర్​, ఆయుష్మాన్​

By

Published : Jun 25, 2020, 10:43 AM IST

సినిమాల్లోకి రాకముందే, బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు విలక్షణ నటుడు ఆయుష్మాన్​ ఖురానా. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. అందులోని ఓ విషయం తనను స్టార్​ను చేసిందని చెప్పుకొచ్చాడు.

"తమిళ సినిమా 'కల్యాణా సమాయల్​ సాధమ్'​ హిందీ రీమేక్​ 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్'. మాతృక చూడకుండానే ఇందులో నటించాను. ఒకవేళ అలా చూస్తే నా నటనపై దాని ప్రభావం పడుతుంది. దీంతో ఫలితం సరిగ్గా రాకపోవచ్చు. అందుకే కేవలం కథ విని నా స్టైల్​లో నటించి ఆయా పాత్రలను పండిస్తాను. ఈ విషయాన్ని అమిర్​​ఖాన్​ దగ్గర నుంచే నేర్చుకున్నాను. గతంలో ఓ ప్రముఖ ఛానెల్​లో పనిచేస్తున్నప్పుడు 'గజిని' ప్రచారంలో భాగంగా ఆయన్ను ఇంటర్వ్యూ చేశాను. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణమేంటని అడిగాను. మాతృక చూడకుండా నటించడమే నటిస్తానని ఆమిర్ చెప్పారు. దీంతో నేను అదే పద్ధతి ఫాలో అయ్యా"

-ఆయుష్మాన్​ ఖురానా, బాలీవుడ్​ నటుడు

బాలీవుడ్​లో విభిన్న కథల చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఆయుష్మాన్.. గతేడాది
'ఆర్టికల్ 15', 'డ్రీమ్​గర్ల్', 'బాలా' చిత్రాల్లో నటించాడు. ఈ సంవత్సరం 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్', 'గులాబో సితాబో'లను విడుదల చేశాడు.

అమీర్​, ఆయుష్మాన్​

ఇది చూడండి : అభినయ ఊర్వశి.. ఈ సినీ సరస్వతి 'శారద'

ABOUT THE AUTHOR

...view details