బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా స్త్రీ పాత్రలో నటిస్తున్నాడు. 'డ్రీమ్‌గర్ల్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజ్ షాంద్లియా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో సీత, ద్రౌపది, రాధ లాంటి పాత్రల్లో ఖురానా కనిపించనున్నాడని దర్శకుడు తెలిపాడు.
"ఆయుష్మాన్ ఈ చిత్రంలో రామాయణంలో సీత, మహాభారతంలో ద్రౌపది, కృష్ణలీలలో రాధను పోలి ఉండే పాత్రల్లో నటిస్తున్నాడు. అతడు ఎందుకు అలా అయ్యాడో అనేది చిత్ర కథాంశం" -రాజ్ షాంద్లియా, దర్శకుడు.