తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లవ్​స్టోరీ: అమ్మాయి ముద్దు పెడితే ఏడుస్తారా..? - AyPilla Musical

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'లవ్​స్టోరీ'. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని 'ఏయ్​ పిల్లా' పాటను మ్యూజికల్​ ప్రివ్యూగా విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

AyPilla Musical Preview from Love Story Movie which starrer by Naga Chaitanya,Sai Pallavi
లవ్​స్టోరీ: అమ్మాయి ముద్దు పెడితే ఏడుస్తారా..?

By

Published : Feb 14, 2020, 12:45 PM IST

Updated : Mar 1, 2020, 7:47 AM IST

ప్రేమకథల్ని తెరకెక్కించడంలో మాస్టర్‌ అనిపించుకున్న దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాల్ని నడిపిస్తూ... హీరోహీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీని పండించే విధంగా సన్నివేశాలు తెరకెక్కిస్తాడు. తాజాగా మరో అందమైన 'లవ్‌స్టోరీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు.

ప్రేమికుల రోజుని పురస్కరించుకొని నేడు ఈ చిత్రంలోని 'ఏయ్‌ పిల్లా...' పాటని మ్యూజికల్‌ ప్రివ్యూగా విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన తర్వాత "ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా.." అని సాయిపల్లవి చెప్పే డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది.

ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సి.హెచ్‌ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్‌దాస్‌, కె.నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం.

Last Updated : Mar 1, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details