తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ నా కోసం స్కూల్​ బంక్​ కొట్టాడు​!' - సుశాంత్​ సోదరి శ్వేతా సింగ్​ కీర్తి

దివంగత నటుడు సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ సోదరి శ్వేతా సింగ్​ కీర్తి.. వారిద్దరికి సంబంధించిన కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకుంది. స్కూల్​కు వెళ్లే సమయంలో ఎంతో సాహసం చేసి తన దగ్గరకు వచ్చాడని తెలిపింది. చిన్నప్పటి నుంచి పక్కనే ఉన్న సోదరుడిని కాపాడుకోలేకపోయామని సోషల్​మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది.

Awwwdorable! Sushant bunked school to be with his sister
'సుశాంత్ నా కోసం స్కూల్​కు బంక్​ కొట్టాడు​!'

By

Published : Jul 27, 2020, 8:14 PM IST

బాలీవుడ్​ దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​కు సంబంధించిన కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలను సోమవారం ఓ పోస్టు ద్వారా పంచుకుంది హీరో సోదరి శ్వేతా సింగ్​ కీర్తి. సుశాంత్​ చిన్నతనంలో స్కూల్​కు బంక్​ కొట్టినప్పటి సంఘటనను ఇన్​స్టాగ్రామ్​లో గుర్తుచేసుకుంది.

"సుశాంత్​ నర్సరీ, నా ప్రిపరేషన్​ క్లాసులు ఒకే భవనంలో జరిగాయి. దాంతో మేము మా మొదటి సంవత్సరం పాఠశాలకు చక్కగా వెళ్లాం. కానీ, నా యూకేజీ క్లాస్​ వేరే దగ్గర ఉంది. సుశాంత్​ ప్రిపరేషన్​ క్లాస్​ రూమ్​ పాత భవనంలో ఉంది. అందువల్ల మేము విడివిడిగా క్లాసుల్లో ఉండేవాళ్లం. ఒకరోజు భోజన విరామ సమయంలో అతడు సరాసరి నా తరగతి గదిలోకి వచ్చాడు. అప్పుడు మేమిద్దరం కేవలం 4 నుంచి 5 ఏళ్ల వయసులో ఉన్నాం. అతడ్ని అక్కడ చూసి నేను షాక్​ అయ్యా. అర కిలోమీటర్​ దూరం నుంచి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగా. అప్పుడు తాను నాతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అర కిలోమీటరు నడిచి బయట సెక్యూరిటీకి కనిపించకుండా భవనంలోకి ప్రవేశించడం ద్వారా ఎంతో ధైర్యం ఉందనుకున్నా" అని శ్వేతా తెలిపింది.

అతడిలో నన్ను చూసుకున్నా

"పాఠశాలలో చేరిన కొత్తలో నాకూ అదే విధమైన ఒంటరితనంగా అనిపించింది. దయచేసి నన్ను ఒక్కదాన్నే వదిలేయవద్దని ఏడుస్తూ నా పేరెంట్స్​ను అప్పట్లో బతిమాలా. అదే పరిస్థితిలో నా సోదరుడ్ని చూస్తే బాధేసింది. అతని ఆందోళన గమనించి నాతో ఉండొచ్చని సుశాంత్​కు చెప్పా. నాకు, నా స్నేహితురాలికి మధ్య టీచర్​కు కనిపించకుండా సుశాంత్​ను దాచా. కానీ, సుశాంత్​ను మా టీచర్​ గమనించారు. నేను కొంచెం భయపడ్డా. ఆ సమయంలో నా సోదరుడిని కాపాడటానికి అతడికి ఆరోగ్యం బాగోలేదని చెప్పా. స్కూల్​ సమయం అయ్యే వరకు సుశాంత్​ నాతో ఉండటానికి టీచర్​ అనుమతి కోరా. దానికి టీచర్ అంగీకరించారు. అప్పుడు మేము చాలా ఆనందించాం. కానీ, నిబంధనల ప్రకారం 2 తరగతుల తర్వాత అతడ్ని తిరిగి తన భవనానికి పంపించారు. సుశాంత్​లో ఆందోళన అంతా పోవడం వల్ల అతను కొంచెం ఆనందంగా వెళ్లాడు" అని ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో రాసుకొచ్చింది శ్వేత.

సుశాంత్ అలా పుట్టాడు

"సుశాంత్​ పుట్టక ముందు నాకు ఒక సోదరుడు కావాలని మా తల్లిదండ్రుల కోరా. అప్పటికే మా పేరెంట్స్​కు మొదట ఓ మగబిడ్డ పుట్టిన ఏడాదిన్నర తర్వాత అతడు మరణించాడు. నా మొదట తోడపుట్టిన సోదరుడ్ని ఎలాగూ చూడలేక పోయా. రెండోసారి కొడుకు పుట్టాలని మా అమ్మనాన్నలు కనిపించిన ప్రతి దేవుడికి పూజలు చేశారు. కానీ, అప్పుడు నేను జన్మించా. దీపావళి రోజున పుట్టిన కారణంగా నన్ను లక్ష్మిజీ అని పిలిచేవారు. ఓ ఏడాది తర్వాత తమ్ముడు సుశాంత్​ పుట్టాడు. అప్పటి నుంచే తన అందమైన నవ్వుతో మెరిసే కళ్లతో అందర్ని మంత్రముగ్దులను చేశాడు. మా జీవితంలోకి మేము కోరుకున్న వాడొచ్చాడని ఆనందించాం. అప్పటి నుంచి నా సోదరుడికి రక్షణగా ఉన్నా" అని చెప్పుకొచ్చింది సుశాంత్​ సోదరి శ్వేతా సింగ్​.

సుశాంత్​ను ముద్దుగా పిలిచేవాళ్లం

సుశాంత్​తో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ చిన్నప్పుడు అతడ్ని 'గుల్షన్​' అని ప్రేమగా పిలిచేవాళ్లమని తెలిపింది శ్వేత. సుశాంత్​ పుట్టినప్పటి నుంచి తాను నేను కలిసి ఆడుకుని.. అల్లరి చేసేవాళ్లమని చెప్పింది. అందువల్ల ఎక్కడికి వెళ్లినా కలిసి ఉండటం వల్ల మా ఇద్దరినీ 'గుడియా-గుల్షన్' అని పిలిచేవారని వెల్లడించింది. ​సుశాంత్​ ఆత్మహత్య చేసుకునే నాలుగు రోజుల ముందు తన​తో చేసిన చాటింగ్​ను స్క్రీన్​షాట్​ తీసి పోస్టు చేసింది సోదరి శ్వేతా సింగ్. తన సోదరిని ఎంతగానో మిస్​ అవుతున్నట్లు, ఆమెను కలవాలనుకుంటున్నట్లు దాని ద్వారా తెలుస్తోంది. దీనిపై స్పందించిన శ్వేత.. "నా దగ్గరకి వచ్చేయి.. ఒక నెల ఉండి, మనసు కుదుట పడ్డాక తిరిగి వెళ్లొచ్చు" అని రిప్లే ఇచ్చింది.

ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న శ్వేత.. తన పెళ్లిరోజున జరిగిన ఓ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది. తనకు వివాహమైన రోజున సుశాంత్​ తనను గట్టిగా కౌగిలించుకున్నట్లు.. తామిద్దరం ఏడుస్తూ బాధపడినట్లు ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లో తెలిపింది. అప్పటి నుంచి ఒకర్ని ఒకరు కలిసి ఉండలేమని చెప్పుకుని బాధపడ్డామని.. ఆ తర్వాత వారి జీవితాలు చాలా బిజీగా మారాయని వెల్లడించింది శ్వేతా సింగ్​. బాలీవుడ్​లో ఎన్నో విజయాలను దక్కించుకుని వారి కుటుంబసభ్యులను గర్వించేలా చేసిన సోదరుడ్ని కాపాడుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details