తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మేము స్నేహితులమే- మాకు రహస్యంగా బిడ్డ...' - Avika Gor dating rumours

ఓ నటుడితో తాను రహస్యంగా బిడ్డకు జన్మనిచ్చినట్లు వస్తోన్న వార్తలను కొట్టిపారేసింది 'ఉయ్యాలా జంపాలా' ఫేం అవికా గోర్​. తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపింది.

avika gor
అవికా గోర్​

By

Published : Jun 22, 2021, 9:36 AM IST

Updated : Jun 22, 2021, 9:44 AM IST

బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్‌. ఈ ముద్దుగుమ్మ తన సహ నటుడు మనీశ్​ రైసింగన్​తో డేటింగ్​లో ఉన్నట్లు చాలా కాలం పాటు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరికి ఓ బిడ్డ కూడా జన్మించినట్లు, దానిని వారు రహస్యంగా ఉంచినట్లు ప్రచారం సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ ఈ విషయమై మాట్లాడింది. అవన్నీ అవాస్తమని కొట్టిపారేసింది.

"మాకు రహస్య బిడ్డ ఉన్నట్లు వార్తలు చాలా వచ్చాయి. మేమిద్దరం మంచి స్నేహితులం. ఇప్పుడు కూడా బాగా కలిసి ఉంటాం. ఈ వార్తలను చూసినప్పుడు మేము బాగా నవ్వుకుంటాం. అతడు నా జీవితంలో కీలక వ్యక్తి. నాకు 13ఏళ్ల వయసు ఉన్నప్పడు నుంచి మా ఇద్దరి మాధ్య ప్రయాణం చాలా బాగా సాగింది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకంటే అతడు 18ఏళ్లు పెద్ద. దాదాపుగా మా నాన్న వయసు."

-అవికా గోర్​, నటి.

గతేడాది నవంబరులో తన ప్రియుడ్ని పరిచయం చేసింది అవికా గోర్​. మిలింద్‌ చద్వానీతో ప్రేమలో ఉన్నానని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అతనితో కలిసి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది.

అవికా బాలనటిగా కెరీర్‌ ఆరంభించింది. పలు టీవీ సీరియళ్లతోపాటు సినిమాల్లోనూ నటించింది. 'ఉయ్యాలా జంపాలా'తో హీరోయిన్​గా వెండితెరకు పరిచయమైంది. 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది 3' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం 'థ్యాంక్​ యూ', శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగాహీరో కల్యాన్​దేవ్​తో ఓ సినిమాలో నటిస్తోంది.

ఇదీ చూడండి:ప్రియుడ్ని పరిచయం చేసిన హీరోయిన్ అవికా గోర్

Last Updated : Jun 22, 2021, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details