అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో మంగళవారం 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ప్రీమియర్ షో జరిగింది. కార్యక్రమంలో రాబర్ట్ డౌనీ జూనియర్(ఐరన్‌మ్యాన్), క్రిస్ హ్యామ్‌వర్త్(థోర్), స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో), క్రిస్ ఇవాన్స్(కెప్టెన్ అమెరికా), బ్రియా లార్సన్(కెప్టెన్ మార్వెల్) విన్ డీజిల్ కనువిందు చేశారు.
'అవెంజర్స్' గుర్తుగా తారల చేతి ముద్రలు - los angles
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తోన్న 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ఈనెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం లాస్ ఏంజెలిస్‌లో ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది.
'అవెంజర్స్' గుర్తుగా చేతి ముద్రలు
టీసీఎల్ చైనీస్ థియేటర్ ఇందుకు వేదికైంది. అవెంజర్స్ గుర్తుగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక మట్టి అచ్చుల్లో చేతి ముద్రలను వేశారు చిత్ర నటీనటులు. అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. 'ద ఇన్ఫినిటీ సాగా'గా మార్వెల్ స్టూడియోస్ రూపొందించిన ఈ సినిమాలో... బలమైన థానోస్‌ను అవెంజర్స్ ఎలా ఓడిస్తారనేది చూపించనున్నారు.