'అవెంజర్స్ ఎండ్ గేమ్' చిత్రం కోసం ఎంతో కాలం ఎదురు చూశారు ప్రేక్షకులు. చివరకు ఏప్రిల్ 26న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కానీ చిత్రకథను ముందే చెప్పేస్తూ.. స్పాయిలర్లు హల్చల్ చేస్తున్నారు. తాజాగా హాంగ్‌కాంగ్‌లో ఓ వ్యక్తి సినిమా థియేటర్ వద్దే 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రకథను బహిర్గతపరిచాడు. ఇంకేముంది ఆనందంగా సినిమా చూద్దామనుకుంటున్న అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. అతడిని థియేటర్ బయటే దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కథ చెప్పాడు... కష్టాలపాలు అయ్యాడు..! - endgame
'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రాన్ని చూసి కథను బహిర్గతపరిచిన ఓ వ్యక్తిని ప్రేక్షకులు దారుణంగా కొట్టారు. హాంకాంగ్‌లో జరిగిందీ ఘటన. సినిమాలోని కీలక సన్నివేశాలను చెప్పే.. స్పాయిలర్లను ఉద్దేశించి ముందే ట్వీట్ చేశారు చిత్ర దర్శకులు.
అవెంజర్స్
సినిమాలోని కీలక సన్నివేశాలను చెప్పే.. స్పాయిలర్లను ఉద్దేశించి ముందే ట్వీట్ చేశారు చిత్ర దర్శకులు రూసో బ్రదర్స్. ఇతరుల ఆనందానికి భంగం కలిగించొద్దంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.