ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతార్ రికార్డు సృష్టించింది. అయితే ఈ రికార్డును తిరగరాసింది 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' సినిమా. మొదటిసారి విడుదలతో కలెక్షన్లు భారీగానే వచ్చినా అవతార్ వసూళ్లను మాత్రం దాటలేకపోయింది. ఇటీవలే కొన్ని సీన్లు కలిపి రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎండ్‌గేమ్. ఈసారి వసూళ్లు బాగానే వచ్చాయి.
బాక్సాఫీస్ వార్: అవతార్ రికార్డుకు 'ఎండ్'గేమ్ - avatar
హాలీవుడ్ చిత్రం 'అవతార్' పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చెరిపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.79 బిలియన్ డాలర్లు కొళ్లగొట్టింది ఎండ్‌గేమ్ చిత్రం.
అవతార్
ప్రస్తుతానికి 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రం 2.79 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. అవతార్ వసూళ్లు 2.7897 బిలియన్ డాలర్లను దాటిపోయింది. అవతార్‌ను అవెంజర్స్ అధిగమించినట్టు మార్వెల్ సంస్థ ప్రెసిడెంట్ కెవిన్ ప్రకటించారు. 2021 డిసెంబర్ 17న విడుదలకానున్న 'అవతార్ 2' చిత్రం 'అవెంజర్స్: ఎండ్ గేమ్' వసూళ్లను అధిగమిస్తుందో లేదో చూడాలి.
ఇవీ చూడండి.. హాలీవుడ్ అద్భుత పాత్రలన్నీ ఒకేచోట కలిస్తే..!