ప్రముఖ హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ భారత్‌లో చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 26న విడుదలవుతున్న ఈ చిత్రం ఆంగ్లం, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో భాగంగా...ఒక్క బుక్ మై షో యాప్‌లోనే 13 లక్షల మంది టికెట్లు కొన్నారట. అంటే క్షణానికి 18 టికెట్లు అమ్ముడుపోయినట్లు సంస్థ సీఓఓ ఆశిష్ సక్సేనా వెల్లడించారు. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’కు ఆంటోని రుస్సో, జో రుస్సో దర్శకులు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న 22వ చిత్రమిది.
టికెట్ సేల్స్‌లో అవెంజర్స్ మిలియన్ ధమాకా - అవెంజర్స్ : ఎండ్‌గేమ్.
'అవెంజర్స్ : ఎండ్‌గేమ్' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 26న విడుదలవుతున్న ఈ సినిమాకు ఒక్కరోజులో 13 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారట.
ఒక్క రోజులో 'అవెంజర్స్' మిలియన్ టికెట్లు సేల్
'అవెంజర్స్' సిరీస్ నుంచి వస్తున్న చివరి సినిమా కావడం వల్ల అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 500 కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్నారు. ఓ హాలీవుడ్ చిత్రం ఇన్ని స్క్రీన్లపై విడుదల కావడం ఇదే తొలిసారి.
రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రుఫలో, క్రిస్ హెమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్, జెరెమీ రెన్నార్, డాన్ షీడ్లే, పాల్ రూడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.