ఏప్రిల్ 26న విడుదలైన 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రం వసూళ్లపరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల మద్దతుతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్‌ల్లో.. క్షణానికి 18 టికెట్లు చొప్పున ఒక్కరోజులో 10 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. చైనాలో విడుదలైన తొలిరోజే రూ.750 కోట్ల కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. భారత్‌లో మొదటిరోజే రూ.53.10 కోట్లు వసూలు చేసి ఇక్కడ అత్యధిక వసూళ్లందుకున్న చిత్రంగా ‘'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' (రూ.52.25 కోట్లు) రికార్డును బద్దలు కొట్టింది.
తాజాగా మరో కళ్లు చెదిరే రికార్డును అందుకొంది 'అవెంజర్స్ ఎండ్‌గేమ్' చిత్రం. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్ డాలర్లు (రూ.8,400 కోట్లు) వసూలు చేసింది. ఈ చిత్రానికి భారత్, అమెరికాలోనూ సినీప్రియులు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎండ్ గేమ్’కు ఇండియాలో 26.7 మిలియన్ డాలర్ల (రూ.187 కోట్లు) షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారత్‌లో ఓ హాలీవుడ్ చిత్రానికి ఇదే రికార్డు ఓపెనింగ్ అని చెప్పొచ్చు. రేపటి కల్లా ఇక్కడ రూ.200 కోట్ల క్లబ్‌ను చేరుకుంటుంది.
అమెరికాలోనూ ఇదే జోరు కనబరుస్తోంది 'అవెంజర్స్ ఎండ్‌గేమ్'. ప్రీమియర్స్‌తోనే రూ.420 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజులకు 340 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘'అవెంజర్స్ ద ఇన్ఫినిటీ వార్'’ 260 మిలియన్ డాలర్లతో నెలకొల్పిన వీకెండ్ వసూళ్ల రికార్డును ‘ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే 3 బిలియన్ డాలర్లు (రూ.2000 కోట్లు) రాబట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ఇవీ చూడండి.. 'క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్'గా శిరీష్