తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తొలిరోజే 'అవెంజర్స్'​ రికార్డు వసూళ్లు - hollywood

విడుదలైన మొదటిరోజే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది 'అవెంజర్స్ ఎండ్​గేమ్' చిత్రం. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1,186 కోట్లు సాధించింది.

అవెంజర్స్

By

Published : Apr 26, 2019, 12:21 PM IST

హాలీవుడ్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది 'అవెంజర్స్' సిరీస్. ఈ సిరీస్​లో చివరి సినిమాగా వచ్చిన 'అవెంజర్స్​ ఎండ్ గేమ్' నేడు విడుదలవగా.. కొన్ని ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందుగానే రిలీజైంది. తొలిరోజే రూ.1,186 కోట్ల వసూళ్లు రాబట్టింది. చైనాలో రికార్డు కలెక్షన్లు సాధించింది.

తాజాగా డ్రాగన్‌ వాసులను పలకరించిన ‘ఎండ్‌ గేమ్‌’ తొలిరోజే రికార్డు వసూళ్లు రాబట్టింది. మొదటిరోజే రూ.750 కోట్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఆసియాలో ఓ హాలీవుడ్‌ చిత్రానికి ఫస్ట్‌ డేనే ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే తొలిసారట.

ఈ సినిమా భారత్‌లో నేడు విడుదలైంది. ముందస్తు బుకింగ్‌ల ద్వారా ఇప్పటికే 10 లక్షల టికెట్లు అమ్ముడై ఓ కొత్త రికార్డును అందుకొంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 500 పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారంటే ‘'అవెంజర్స్ ఎండ్‌గేమ్‌’'కు భారత్‌లో ఏ స్థాయిలో క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సినీప్రియుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే రూ.20 వేల కోట్లను అందుకుని ‘'అవతార్‌' అత్యధిక వసూళ్ల రికార్డు (రూ.18,700 కోట్లు)ను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవీ చూడండి.. 'బాండ్ 25'లో నటించే తారలు వీరే...

ABOUT THE AUTHOR

...view details