తెలంగాణ

telangana

ETV Bharat / sitara

500 థియేటర్లలో అవెంజర్స్ ఎండ్​గేమ్​ - తెలుగు

అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 500 స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో విడుదల కానుంది. ఎక్కువ థియేటర్లలో విడుదల కానున్న తొలి హాలీవుడ్ అనువాద సినిమాగా రికార్డుకెక్కింది.

అవెంజర్స్ ఎండ్​గేమ్

By

Published : Apr 21, 2019, 4:39 PM IST

హాలీవుడ్​ చిత్రం అవెంజర్స్ ఎండ్​ గేమ్​ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 500 పైగా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇంతవరకు ఏ హాలీవుడ్ అనువాద చిత్రం ఇన్నీ థియేటర్లలో విడుదలకాలేదు.

ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్​ సిరీస్​కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్​లో చివరి చిత్రమైన ఎండ్​గేమ్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత్​లో పది భాషల్లో అనువాదమైందీ చిత్రం. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్​కు సీక్వెల్​గా వస్తున్న ఈ చిత్రాన్ని అంథోని రసో, జోయ్ రసో తెరకెక్కించారు.

రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, క్రిస్ హేమ్స్​వర్త్, మార్క్ రఫాలో, స్కార్లెట్ జాన్సన్ లాంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. మార్వెల్ స్టూడియోస్​ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

ABOUT THE AUTHOR

...view details