తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎండ్​గేమ్​లో థానోస్​పై గెలుస్తారా.. - TRAILER

గత ఏడాది వచ్చిన 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్'​కు సీక్వేల్​గా తెరకెక్కిన చిత్రం 'అవెంజర్స్ ఎండ్ గేమ్'. ఈ సినిమా రెండో ట్రైలర్ విడుదలైంది.

ఎవేంజర్స్ ఎండ్ గేమ్

By

Published : Mar 14, 2019, 9:55 PM IST

'అవెంజర్స్​ ఎండ్ గేమ్' చిత్ర రెండో ట్రైలర్ విడుదలైంది. భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్​తో కూడిన ప్రచార చిత్రం సినీ ప్రియుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఇవాన్స్, మార్క్ రోఫాలో లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత ఏడాది వచ్చిన అవేంజర్స్ ఇన్ఫినిటి వార్​కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2018లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. మొత్తంగా చూసుకుంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

మొదటి భాగాన్ని తెరకెక్కించిన ఆంథోనీ రసో, జోయ్ రసోలే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మార్వేల్ స్టూడియోస్, వాల్డ్ డిస్నీ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.

ABOUT THE AUTHOR

...view details