తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అవెంజర్స్​ ఎండ్​ గేమ్'​ తెలిసిందొక్కడికే...! - అవెంజర్స్​

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తోన్న అవెంజర్స్​ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఐరన్​ మ్యాన్​గా నటించిన రాబర్డ్​ డౌనీ జూనియర్​ ఒక్కడికే అవెంజర్స్​ ఎండ్​ గేమ్ స్టోరీ తెలుసంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రచయిత, దర్శకుడు జో రూసో.

'అవెంజర్స్​ ఎండ్​ గేమ్'​ తెలిసిందొక్కడికే...!

By

Published : Apr 20, 2019, 11:27 PM IST

'అవెంజర్స్' చిత్రానికి త్వరలో ముగింపు పలకనున్నారు దర్శకులు రూసో బ్రదర్స్​. 'అవెంజర్స్​: ఎండ్​గేమ్​' పేరిట విడులవుతున్న చివరి భాగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయి నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ కథను చాలా రహస్యంగా ఉంచారు .

ఆంథోనీ రూసో, జో రూసో

ఈ సూపర్​ హీరో చిత్రానికి సంబంధించిన పూర్తి కథ ఐరన్​ మ్యాన్​ పాత్ర పోషిస్తోన్న రాబర్డ్​ డౌనీ​ జూనియర్​ ఒక్కడికే తెలుసంటూ ఓ ఇంటర్వూలో వెల్లడించారు రచయితలు జో రూసో, ఆంథోనీ రూసో. మిగతా అవెంజర్స్​కు వాళ్ల పాత్రల సన్నివేశాలు మాత్రమే తెలుసని ​స్పష్టంచేశారు. ఈ సినిమా ఏప్రిల్​ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భారత్​లో ఇంగ్లీష్​, హిందీ, తమిళ​, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ABOUT THE AUTHOR

...view details