హాలీవుడ్ ప్రముఖ నటి డయానా రిగ్(82), క్యాన్సర్తో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. గురువారం ఆమె మృతి చెందినట్లు రిగ్ ఏజెంట్ సైమన్ బెర్స్ఫోర్డ్ వెల్లడించారు. "గత నెలంతా అమ్మ చాలా ఎంజాయ్ చేశారని, ఆమెను చాలా మిస్ అవుతున్నాను" అని డయానా కుమార్తె స్టెర్లింగ్ చెప్పారు.
'జేమ్స్ బాండ్' భామ డయానా కన్నుమూత - 'Avengers' and 'Game of Thrones' star Diana Rigg
పలు ఇంగ్లీష్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న డయానా రిగ్ మరణించారు. 1970ల్లో జేమ్స్ బాండ్ భామగా ఈమె గుర్తింపు తెచ్చుకున్నారు.
నటి డయానా రిగ్
1969లో జేమ్స్ బాండ్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన డయానా రిగ్.. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించి, అభిమానుల్ని అలరించారు. 'అవెంజర్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్లో కీలక పాత్రలు పోషించారు.