తెలుగు సినీ పరిశ్రమకు 'అష్టాచమ్మా'తో ఎంట్రీ ఇచ్చి నటుడిగా గుర్తింపు పొందారు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas). ప్రస్తుతం దర్శకుడిగా, రచయితగానూ రాణిస్తున్నారు. అయితే 'అష్టాచమ్మా' సినిమాలో ఛాన్స్ దక్కించుకొని, షూటింగ్ పూర్తయి.. ట్రైలర్ వచ్చేంత వరకు ఆ విషయాన్ని వాళ్ల అమ్మానాన్నకు చెప్పలేదట శ్రీనివాస్. అది చూశాక.. 'చేస్తే చేశావ్ గానీ ఇంకెప్పుడూ చేయకు అని మా నాన్న అన్నారు' అని తాజాగా వెల్లడించారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho saradaga) కార్యక్రమానికి విచ్చేసి.. పలు ఆసక్తికర సంగతులను పంచుకున్నారు అవసరాల శ్రీనివాస్.
'ఇంకెప్పుడూ నన్ను సినిమాలు చేయొద్దన్నారు' - 101 జిల్లాల అందగాడు
'అష్టా-చమ్మా'తో వెండితెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas). ప్రస్తుతం హీరోగా, నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. అవసరాల హీరోగా నటించిన '101 జిల్లాల అందగాడు' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho saradaga) కార్యక్రమానికి విచ్చేసిన ఆయన.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అవసరాల శ్రీనివాస్
అవసరాల హీరోగా నటించిన '101 జిల్లాల అందగాడు' సినిమా ఇటీవలే విడుదలైంది. అయితే విగ్గుకు సంబంధించి ఈ సినిమాకు చెందిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ మేరకు స్పందించిన అవసరాల.. ప్రమోషన్ కోసమే ఇలా చేసినట్లు సమాధానం ఇచ్చారు. దీంతో పాటు మరిన్ని విషయాలు పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ నేటి (సెప్టెంబర్ 6) రాత్రి ఈటీవీలో రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి.
ఇదీ చూడండి:ఆ ముద్దుగుమ్మకు బన్నీ మూడో ఛాన్స్!
Last Updated : Sep 6, 2021, 1:39 PM IST