లాక్డౌన్లో వలసకూలీల పాలిట దేవుడిలా మారిన నటుడు సోనూసూద్.. ఎంతోమందిని వారివారి స్వస్థలాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన జీవితం ఆధారంగా పుస్తకం రాస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు దానికి 'నేను దేవుడ్ని కాదు(ఐయామ్ నో మెసాయ్)' పేరుతో తీసుకురానున్నారు. ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మహమ్మారి కాలంలో సోనూ చూసిన ప్రజల కష్టాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రచిస్తున్నట్లు తెలిపారు. మీనా అయ్యర్‌తో కలిసి ఈ పుస్తకాన్ని రాస్తున్నారు సోనూ.
"ప్రజలు నన్ను దేవుడు అని ప్రేమతో పిలుస్తున్నారు. కానీ, నిజంగా దేవుడిని కాదు. నా మనసు ఏం చెప్పిందో... అది మాత్రమే చేశాను. ఆపదలో ఇతరులకు ఆసరాగా నిలవడం మానవులగా మన బాధ్యత"