టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి మధ్య ప్రేమ వ్యవహారం నిజమేనన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో రాహుల్ తనవాడు అన్నట్లుగా ట్వీట్ చేసిన ఈ భామ.. ఆదివారం కేఎల్ పుట్టినరోజు సందర్భంగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇరువురు కలిసి దిగిన ఓ సెల్ఫీ చిత్రాన్ని ఇన్‌స్టాలో పెట్టి.. 'రాహుల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది.(గ్రేట్ ఫుల్ ఫర్ యూ) జన్మదిన శుభాకాంక్షలు' అని కాప్షన్ జోడించింది.
రాహుల్ 29వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లతో పాటు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. తన రూమర్ గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి.. ఈ విధంగా పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది.