క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మూడు ముళ్ల బంధం ద్వారా ఒక్కటయ్యారు.ఇదే బాటలో మరో భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ వెళ్తున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో అతడు డేటింగ్ ఉన్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. అతియా శెట్టి.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. గత మూడు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఇటీవలే ఓ డిన్నర్‌కు వెళ్లి వస్తూవీరిద్దరూ కెమెరాకు చిక్కారు. ఈ ఫొటోల్లో ఆకాశ్ రంజన్ కపూర్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.