Rahul-Athiya Marriage: టీమ్ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సునీల్ కుమారుడు అహాన్ కూడా ఇదే ఏడాది వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో బీటౌన్‌లో ఇప్పుడు శెట్టి కుటుంబంలో వివాహ వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు.
సునీల్ శెట్టి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ అతియాశెట్టి. హీరోయిన్‌గా సరైన సక్సెస్‌ని అందుకోలేకపోయిన ఈ భామ.. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉంది. సుమారు మూడేళ్ల నుంచి డేటింగ్‌లో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారం తెలిపారట. దీంతో ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.