వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు బాలీవుడ్ దిగ్గజ నటి వహీదా రెహ్మాన్. 83ఏళ్ల వయసులోనూ అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్రంలో తన కూతురు కష్వి రేఖితో కలిసి స్కూబా డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన ఫొటోను కష్వి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
ఎనిమిది పదుల వయసులో ఆ నటి స్కూబా డైవింగ్ - వహీదా రెహ్మాన్
83ఏళ్ల వయసులోనూ స్కూబా డైవింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు బాలీవుడ్ నటి వహీదా రెహ్మాన్. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె కుమార్తె సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
బాలీవుడ్ నటి వహీదా రెహ్మాన్.. తన అందం, అభినయంతో పాటు తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అమయాకమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించారు. 2019లో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారి దేశంలోని అనేక ప్రాంతాలను తిరగుతూ మలిదశలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాలైన టాంజానియా, నమిబియా, కెన్యా వంటి ప్రదేశాలను ఆమె చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే 2019లో అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. స్కూబా డైవ్ చేయడం తనకున్న కోరికల్లో ఒకటని అప్పుడు చెప్పారు. ఇప్పుడా కోరికను కూతురితో కలిసి తీర్చుకున్నారు.