"ఎటు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు.. వేట కుక్కల్లాగా వెంటపడే జాలర్లు.. శకుని లాంటి ఒక ముసలోడు.. వీళ్లందర్ని ఒకే స్టేజ్ మీద ఆడిస్తున్న సూత్రధారి ఎవరు?" అని తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నాడు హీరో నాగశౌర్య. అతడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు స్వయంగా తనే కథనూ అందించాడు. రమణ తేజ దర్శకుడు. మెహరీన్ కథానాయిక. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.
ఆకట్టుకుంటున్న 'అశ్వథ్థామ' సినిమా ట్రైలర్ - మెహరిన్
యువ కథానాయకుడు నాగశౌర్య నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను సినీదర్శకుడు పూరిజగన్నాథ్ విడుదల చేశాడు.
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌లో నాగశౌర్య లుక్‌తోపాటు ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'రాక్షసుడ్ని, భగవంతుడ్ని చూసిన కళ్లు.. ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతే..' అని విలన్ చెప్పే డైలాగులతోపాటు 'ఆడపిల్ల చావు మీద మీకెందుకు బాబు అంత ఇంట్రస్ట్. దాని మీద వంద కథలు వెయ్యి పుకార్లు పుట్టించేదాకా మీకు నిద్రపట్టదే' అనే డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.
ఇదీ చూడండి.. చక్రవర్తి 'చంద్రగుప్త మౌర్య'పై కంగనా సినిమా..?