కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా ప్రేమకథల్లోనే కనిపించాడు హీరో నాగశౌర్య. ఇటీవలే తన పంథా మార్చి 'అశ్వథ్థామ' అనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటించాడు.ఈ చిత్ర కథ ఇతడే రాయడం మరో విశేషం. ఇందులో మాస్ హీరోలను తలపించేలా ఫైట్లు చేశాడు శౌర్య. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాలోని 3 నిమిషాల పాటు సాగే ఓ సింగిల్ షాట్ పోరాట సన్నివేశాన్ని తాజాగా విడుదల చేశారు.ఈ వీడియోలో.. ఓ ఇంట్లో మద్యం తాగుతూ ఉన్న కొందరు వ్యక్తులను, చితకబాదుతూ కనిపించాడీ హీరో.
'అశ్వథ్థామ' సింగిల్ షాట్లో ఫైట్ చేస్తే - cinema news
'అశ్వథ్థామ'లోని సింగిల్ షాట్లో తెరకెక్కించిన ఓ పోరాట సన్నివేశాన్ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఇందులో హీరో నాగశౌర్య.. కొందరు వ్యక్తులను చితకబాదుతూ కనిపించాడు.
'అశ్వథ్థామ'లో హీరో నాగశౌర్య
ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించింది. రమణతేజ దర్శకుడిగాప పరిచయమయ్యాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మాల్పురి నిర్మాతగా వ్యవహరించారు.
Last Updated : Feb 29, 2020, 6:37 PM IST